New Traffic Rules in Ap: నిబంధనల వయోలేషన్ చేస్తే..వాయింపే 1 y ago
AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే రూల్స్ పాటించని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సవరించిన జీఓ 21 ప్రకారం ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే డ్రైవింగ్ చేసే వారికి రూ. 1000, వెనుక కూర్చున్న వ్యక్తికి రూ.1000, ఇన్సురెన్స్ సర్టిఫికెట్ లేకపోతే మొదటి సారి రూ.2000, రెండోసారి రూ. 4000, లైసెన్స్ లేకపోతే రూ.5000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే 1500, వాహనం నడిపే సమయంలో చేతిలో సెల్‌ఫోన్ ఉంటే మొదటిసారి రూ.1500, రెండోసారి రూ.10,000 వరకు జరిమానా విధిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
యూనిఫాం లేకుండా ట్రాన్స్పోర్ట్ వాహనాలు నడిపితే మొదటిసారి రూ.150, రెండోసారి రూ.300, సీట్ బెల్టు ధరించకపోతే డ్రైవర్‌కు రూ.1000, సహ ప్రయాణికులకు రూ.1000, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయకుండా నడిపితే మొదటిసారి రూ.2000, రెండోసారి రూ.5000, అతి వేగంగా వాహనం నడిపితే రూ.1000, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1000, రేసింగ్ చేస్తే మొదటిసారి రూ.5000, రెండోసారి రూ.10,000 వరకు జరిమానాలు విధిస్తామని తెలిపారు.